మెగా ఫ్యామిలిలో కరోనా కలకలం రేగుతుంది. గత కొన్ని రోజులుగా మెగా ఇంట వరుస వేడుకలు జరుగుతున్నాయి. ఇటీవల క్రిస్టమస్ సందర్భంగా మెగా కజిన్స్ అంతా కలిసి ఒక చోట చేరారు. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రకటించి షాకిచ్చాడు. కొద్ది గంటల వ్యవధిలోనే మరో హీరో వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా వచ్చినట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
తాజాగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసినా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ కు కరోనా వచ్చిన విషయాన్ని తెలుపుతూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసారు. రామ్ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. అయితే వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో తనకు కూడా కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కానీ కరోనా పరీక్షల్లో మాత్రం తనకు నెగిటివ్ వచ్చిందన్నారు.
ప్రస్తుతం ‘మిస్టర్ సి’ తో క్వారెంటైన్ లో గడుపుతున్నా. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు అతను చాలా ధైర్యంగా ఉన్నాడు. నాకు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువే కానీ నెగిటివ్ వచ్చింది. వచ్చే ఏడాది బాగుండాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం వేడి ద్రవాలు, విశ్రాంతి, ఆవిరితో సమయం గడుపుతున్నామంటూ ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు మెగా ఫ్యామిలిలో మరికొంత మందికి కూడా కరోనా సోకె అవకాశాలు ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.