logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఢిల్లీ ఆందోళనల్లో ట్విస్ట్.. ఊహించని పరిణామాలతో షాక్ లో రైతులు!

ఢిల్లీ రైతుల ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. కొత్త చట్టాలను వెనక్కి తీసుకునేవరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. 3 నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులను చుట్టుముట్టిన రైతులు గణాంతంత్ర దినోత్సవం సందర్భంగా ఆందోళనలు ఉదృతం చేశారు. కాగా ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.

గురువారం రోజున ఘాజీపూర్ సరిహద్దులను ఖాళీ చేయాలని యూపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో రైతులను ఖాళీ చేయించడానికి వచ్చిన భద్రతా దళాలతో వాగ్వాదం నెలకొంది. మరోవైపు సింఘు సరిహద్దుల్లో రైతులతో అక్కడి స్థానికులు వాగ్వాదానికి దిగారు. రైతులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులు ఏర్పాటు చేసిన గుడారాలను తొలగించే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మొదట రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన స్థానికులు ఇప్పుడు వారిని విమర్శించడం గమనార్హం. రైతుల వల్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయని, రైతుల ఉద్యమం వేరొకరి చేతుల్లోకి వెళ్లిందని అందుకే తమ మద్దతును వెనక్కి తీసుకుంటున్నామని వారు ఆరోపిస్తున్నారు. ఊహించని విధంగా స్థానికుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత రైతులను షాక్ కు గురి చేసింది.

Related News