logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మూవీ రివ్యూ: ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’

నటీనటులు : సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, సుహాస్
దర్శకుడు : వెంకటేష్ మహా
నిర్మాత : విజయ ప్రవీణ పరుచురి, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సంగీతం : బిజిబాల్

కరోనా కారణంగా చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా ఆన్‌లైన్‌లో థియేటర్ల కంటే ముందే విడుదల అవుతున్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజులు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కూడా లేకపోవడంతో తాజాగా మరో తెలుగు సినిమా కూడా ఓటీటీలో విడుదలైంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా కు తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించిన వసంగతి తెలిసిందే. ఇప్పుడు మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి రీమేక్ గా ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమాను తెరకెక్కించాడు. తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబ‌లి సినిమా నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, ప్రవీణ పరుచూరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూద్దాం..

కథ:
జీవితంలో ఎలాంటి ఆర్భాటాలు, చీకు చింతా లేకుండా సొంతూరులో హాయిగా బతికేస్తుంటాడు మహేష్(సత్యదేవ్). జబ్బు పడిన తండ్రి, నాటు వైద్యం చేసే బాబ్జీ(నరేష్), అతని దగ్గర పనిచేసే యువకుడు (సుహాస్) మహేష్ చుట్టూ ఉండే ప్రపంచం. మహేష్ కు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. అదే తన వృత్తిగా ఎంచుకుంటాడు. గొడవలంటే ఏమాత్రం గిట్టని వ్యక్తి. ఈ కారణంతో అతను ప్రేమించిన అమ్మాయి (హరి చందన) అతన్ని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఈ క్రమంలో మహేష్ కు జోగి అనే రౌడీతో వివాదం ఏర్పడుతుంది. జోగి కారణంగా ఊరందరి మధ్య మహేష్ కు అవమానం జరుగుతుంది. ఆ అవమానాన్ని మహేష్ తట్టుకోలేకపోతాడు. దీంతో అతనిపై ప్రతీకారం తీర్చుకునే వరకు కాళ్లకు చెప్పులేసుకోనని మహేష్ శపథం చేస్తాడు. అదే సమయంలో జోగి చెల్లి జ్యోతి(రూప కొడవయూర్) తో మహేష్ ప్రేమలో పడతాడు. దీంతో అసలు కథ మొదలవుతుంది. ఈ క్రమంలో మహేష్ ప్రతీకారాన్ని, ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకోగలిగాడు అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ముందుగా మలయాళ రీమేక్ అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు వెంకటేష్ మహాను అభినందించాల్సిందే. ట్రైలర్ లో చేసినట్టుగానే సినిమా చూస్తున్నంత సేపు బాగ్ గ్రౌండ్ లో వచ్చే ప్రకృతి అందాలు, సహజమైన నేపథ్య సంగీతం ప్రేక్షకుల మనసుని హత్తుకునే విధంగా ఉంటాయి. మలయాళ సినిమాకు జాతీయ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు జిజ్ బాల్ తెలుగు రీమేక్ కు కూడా పనిచేసారు. సినిమా మొత్తం ప్రేక్షకులు కూడా మహేష్ వెంట ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించాడు దర్శకుడు. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్ ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. అతని కెరీర్ బెస్ట్ పర్ఫర్ మేన్స్ గా ఈ సినిమా నిలిచిపోతుంది. భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్స్ లో సత్య దేవ్ నటన కట్టిపడేస్తుంది.

సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యి వెండి తెరపై వరుస అవకాశాలు అందుకుంటున్న యువ నటుడు సుహాస్ నటన సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. తన పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో సుహాస్ అలరిస్తాడు. సీనియర్ నటుడు నరేష్ పోషించిన బాబ్జి పాత్ర సినిమాలో మరో చెప్పుకోదగ్గ విషయం. కథ విషయానికొస్తే.. మలయాళంలో ఈ సినిమా ఒరిజినల్ చూసిన వారికి మాతృకలో ఉన్నంత సహజత్వం కనిపించకపోవచ్చు. కానీ తెలుగు నేటివిటీకి ఏమాత్రం తీసిపోకుండా సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు. సరదా సన్నివేశాలు, ఆహ్లాదం పంచె అంశాలతో ఫస్ట్ హాఫ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడా సినిమా కొంచెమ్ స్లో అయినట్టుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటె ఈ సినిమా విజయం మరో స్థాయిలో ఉండేది. అంతకుమించి ఈ సినిమా చూడకుండా ఉండటానికి పెద్ద కారణాలేమీ కనిపించవు. లాక్ డౌన్ లో సినిమాల కోసం ఓటిటీ మీద ఆధారపడుతున్న ప్రేక్షకులకు రెండున్నర గంటల వినోదం పంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమా కథ, సత్యదేవ్ నటన, సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ సినిమాను మరింత కలర్ ఫుల్ గా మార్చింది. రెండో హీరోయిన్ గా నటించిన రూప ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే పరంగా ఇంకా కొంచెం శ్రద్ధ వహిస్తే సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది. ఎడిటింగ్ పరవాలేదనిపిస్తుంది. అక్కడక్కడా నెమ్మదించే సన్నివేశాలు మైనస్ గా నిలిచాయి.

రేటింగ్: 3/5

Related News