logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

ఇండియా లెవల్లో ట్రెండ్ అవుతున్న ఉదయ్ కిరణ్ పేరు

ఉదయ్ కిరణ్. ఈ పేరు మరచిపోవడం తెలుగు ప్రేక్షకులకు అంత సులభం కాదేమో. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఉదయ్ చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో ఊహించని విధంగా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. 2000 సంవత్సరంలో అతని సినిమాలను ఇష్టపడని యూత్ ఉండేవారు కాదు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా అలాగే ఆదరించారు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులో నంది అవార్డు సొంతం చేసుకున్న నటుడిగా రికార్డు సృష్టించాడు. అతను నటించిన సినిమాలు నిర్మాతలకు పదింతలు లాభాలు తెచ్చి పెట్టిన రోజులున్నాయి.

కానీ ఎందుకనో 2004 తర్వాత ఉదయ్ కెరీర్ కిందకు పడిపోయింది. ఎన్ని సినిమాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. 2014 లో ఉదయ్ మరణ వార్త ప్రతి ఒక్కరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రేక్షకులు ఉదయ్ మరణాన్ని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. మొన్నామధ్య బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణిస్తే ఉదయ్ కిరణ్ ను గుర్తు చేసుకుని బాధపడ్డారు మనవాళ్ళు.

ఈరోజు ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు కావడంతో ఉదయ్ అభిమానులను అతని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఉదయ్ ను గుర్తుచేసుకుంటూ అతని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలతో ఉదయ్ అనుబంధాన్ని తెలుపుతున్నారు. లక్షల మంది ఉదయ్ కిరణ్ పై స్పందిస్తుండటంతో నేడు ఇండియా లెవల్లో ఉదయ్ కిరణ్ పేరు ట్రేండింగ్ లో ఉంది. ఉదయ్ కిరణ్ ట్వీట్లతో ట్విట్టర్ మార్మోగుతుంది.

Related News