logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

విద్యార్థినికి మత్తుమందు ఇచ్చి అసభ్య వీడియోలు తీసిన యువకులు.. అరెస్ట్!

నగ్న వీడియోలు బయట పెడతామంటూ మూడేళ్ళుగా ఓ విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థిని దివ్యకు మూడేళ్ళ క్రితం వరుణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమెకు మాయ మాటలు చెప్పి తన అపార్టుమెంట్ కు తీసుకెళ్లాడు వరుణ్. అనంతరం ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి విద్యార్థిని పై అసభ్య వీడియోలను చిత్రీకరించాడు.

ఆ వీడియోలను అడ్డు పెట్టుకుని ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో వరుణ్ ను దూరం పెట్టింది దివ్య. తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన సమయంలో దివ్యకు కౌశిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో కౌశిక్ కుటుంబ సభ్యులు ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లి ఆరా తీయగా వరుణ్ విషయం బయటకు వచ్చింది. అతని వద్ద నుంచి దివ్య వీడియోలను సేకరించి కౌశిక్ కు చూపించారు. దీంతో దివ్యపై అనుమానం పెంచుకున్న కౌశిక్ ఆ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు.

దివ్య నగ్న వీడియోలను ఇంటర్ నెట్ లో పెట్టి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. వీడియోలను చూపించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దివ్య కుటుంబ సభ్యులు వరుణ్, కౌశిక్ కుటుంబాలతో ప్రాధేయపడి ఆ వీడియోలను ఇంటర్ నెట్ నుంచి తీసేయించారు. అయితే ఇటీవల దివ్య వీడియోలు మళ్ళీ ఇంటర్ నెట్ లో కనిపించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించగా వరుణ్, కౌశిక్ అను అదుపులోకి తీసుకున్నారు.

Related News