logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

ఈ రెండు లక్షణాలు ఉన్నాయా?.. కరోనా కావచ్చంటున్న కేంద్రం!

జలుబు, జ్వరం, కళ్ళు ఎర్రబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, ఒళ్ళు నొప్పులు, విరేచనాలు ఇవన్నీ కరోనా వైరస్ కు సంకేతాలుగా గుర్తించాలని కేంద్ర ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో రెండు లక్షణాలను కూడా కేంద్రం చేర్చింది.

అవేమిటంటే.. ఉన్నట్టుండి వాసన, రుచి చూసే శక్తిని కొల్పోవడం కూడా కరోనా లక్షణాలు గానే గుర్తించాలని ‘క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్: కోవిడ్-19’ అనే ప్రత్యేక డాక్యుమెంట్ లో ఈ మేరకు ప్రచురించారు. ఈ ప్రత్యేక పత్రాన్ని దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు సందేహ నివృత్తిని అందించనున్నారు. ఈ నేపథ్యంలో వాసనలు గుర్తించడంలో విఫలం కావడం, రుచిని తెలుసుకోలేకపోవడం కూడా కరోనా వైరస్ వలన కలిగే లక్షణాలు కావచ్చని కేంద్రం అభిప్రాయపడింది.

కరోనా వైరస్ ముఖ్యంగా వ్యక్తులు సన్నిహితంగా మెలగడం, నోరు, ముకు ద్వారా వచ్చే తుంపర్లలో కలిగి ఉంటుందని, కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్లు ఏదైనా ప్రదేశం పై పడతాయి. అప్పుడు ఎవరైనా ఆ ప్రదేశాన్ని తాకి ముక్కు, నోటి దగ్గర పెట్టుకున్నా వైరస్ భారిన పడతారని ఈ డాక్యుమెంట్లో తెలిపారు.

Related News