logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

సెల్ఫీ కోసం నది మధ్యలోకి.. ప్రాణాల మీదకు తెచ్చిన యువతుల సరదా

తెలుగు రాష్ట్రాల్లో బియాస్ నది ఘటన ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్థాంతరంగా నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగేది. కానీ సమయానికి పోలీసులు, స్థానికులు అప్రమత్తమయ్యి రెండు నిండు ప్రాణాలను కాపాడారు. సెల్ఫీ పిచ్చితో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా యువత వైఖరిలో మార్పు రావడం లేదు.

కొన్ని ఘటనల్లో చనిపోతున్నా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్ఫీల కోసం ఆరాట పడొద్దని .. పిచ్చి స్టంట్లు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదు. తాజాగా సెల్ఫీ తీసుకోవడానికి నదిలోకి దిగిన ఇద్దరు యువతులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని ఆరుగురు యువతులు పెంచ్‌ నది తీరానికి విహారానికి వెళ్లారు. అందులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకోవడానికి నది మధ్యలోకి వెళ్లారు.

అక్కడున్న ఓ బండరాయిపై కూర్చుని సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. ఆ విషయం గమనించేలోపే ఇద్దరు యువతులూ నదిలో చిక్కుకున్నారు. నీటి మట్టం పెరిగిపోయింది. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో ఇద్దరినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చడంతో పెను ముప్పు తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News