logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

నటి ఆత్మహత్య.. విషం తాగుతూ సెల్ఫీ వీడియో

కన్నడ టీవీ నటి చందన(29) ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తి పెళ్ళికి నిరాకరించడంతో ఆమె తన నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ప్రియుడు చందనను ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.

బెంగుళూరు పోలీసుల కథనం ప్రకారం.. హాసన్ జిల్లా బేలూరుకు చెందిన చందన దినేష్ అనే వ్యక్తి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని చందన దినేష్ ను కోరగా దినేష్ అందుకు నిరాకరించాడు. ఈ విషయంపై చందన దినేష్ తల్లిదండ్రులను ఆశ్రయించింది. వారు కూడా చందనను అవమానించి పంపడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె తన నివాసంలో విషం తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది.

అందులో తాను తన కెరీర్ ను, డబ్బును దినేష్ కోసం అర్పించానని ఇప్పుడు పెళ్లి చేసుకోమని కోరితే తనను మోసం చేసాడని మరో అమ్మాయితో తిరుగుతున్నాడని విలపించింది. ఈ వీడియోను దినేష్ కు వాట్సాప్ చేసింది. కంగారు పడి అక్కడకు వచ్చిన దినేష్ చందనను ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుండి పరారయ్యాడు. చందన ప్రాణాలు కోల్పోవడంతో వీడియో ఆధారంగా పోలీసులు దినేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసారు. పరారీలో ఉన్న దినేష్ కోసం గాలిస్తున్నారు.

Related News