logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

ఆర్థిక మంత్రిని ‘కాలనాగు’ అంటూ.. ఎంపీ వ్యాఖ్యలపై దుమారం

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణం. కానీ తాజాగా తృణమాల్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సెరాంపూర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుత్తుంది. నిర్మలాసీతారామన్ ను విష సర్పం తో పోలుస్తూ అయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ బెనర్జీ బంకురా జిల్లాలో ఓ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కాలనాగు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆమె నాశనం చేసారు. ఇలాంటి చెత్త ఆర్థిక మంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదు. విష సర్పం కాటుకు మనుషులు ఎలా చనిపోతారో.. నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవహారాలతో ప్రజలు బలవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ పార్టీ నేతలు బెనర్జీపై మండిపడుతున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పట్టు కోల్పోయారని చెప్పడానికి తృణమాల్ నేతల వ్యాఖ్యలే నిదర్శనమని అసహనం పరిగిపోవడంతో ఇలా అర్థం పర్వతం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్మలా సీతారామన్ పై కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ లో కొన్ని చోట్ల బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేసారు.

Related News