logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మిన్నంటిన నిరసనలు.. బంకర్లో తలదాచుకున్న ట్రంప్

అమెరికాలో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయుడి మరణం పై నిరసనలు మిన్నంటాయి. నిరసన కారులు శుక్రవారం రాత్రి వైట్ హౌస్ ను చుట్టుముట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా వందల మంది వైట్ హౌస్ పై రాళ్ల దాడి చేయడం మొదలుపెట్టారు. వైట్ హౌస్ లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. చుట్టు పక్కల ఉన్న బారికేడ్లకు నిప్పంటించారు.

ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా నిరసనకారుల నుండి అధ్యక్షుడు ట్రంప్ ను కాపాడేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలో ట్రంప్ ను వైట్ హౌస్ లోని రహస్య బంకర్ లోకి తరలించినట్టుగా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. నిరసనలు చెలరేగుతున్న సమయంలో దాదాపు గంట పాటు ట్రంప్ బంకర్ లోనే తలదాచుకున్నట్టుగా కథనంలో పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ట్రంప్ సతీమణి మొలనియా ట్రంప్, కుమారుడు బారన్ ట్రంప్ కూడా ఆయనతో పటు ఉన్నారా అనే విషయం తెలియరాలేదు. అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధ్యక్షమైన ట్రంప్ ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళవలసి రావడం అక్కడి ప్రజల ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది.

ఫోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రికా యువకుడిని ఓ పోలీసు అధికారి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఏ ఒక్క అధికారి కూడా అతనిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. మే 25న జరిగిన ఈ ఘటనలో ఆ యువకుడు మరణించాడు. ఆనాటి నుండి అమెరికాలో నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. నల్ల జాతీయులపై ఇకనైనా వివక్ష చూపడం మానుకోవాలని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. యువకుడి మృతికి కారణమైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related News