logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

తక్షణమే ఓట్ల లెక్కింపు ఆపాలి.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తక్షణమే ఆపాలంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసాడు. బుధవారం వైట్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ తన కుటుంబ సభ్యులకు, తనకు ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇప్పటికే తమ పార్టీ గెలుపు ఖాయమైందన్నారు.

ఓడిపోతామనుకున్న ఫ్లోరిడాలో ఘన విజయం నమోదైంది. టెక్సాస్లో కోట్లాది మంది ఓట్లతో గెలిచాం. పెన్సిల్వేనియాలో తామే లీడ్ లో ఉన్నట్టుగా తెలిపారు. జార్జియాలోని తామే గెలవబోతున్నామని అన్నారు. మధ్యాహ్నం 12:58 నిమిషాలకు ట్రంప్ ఈ ప్రకటన చేయగా అప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం బైడెన్ 225 సీట్లు సాధించి ట్రంప్ కన్నా 12 సీట్ల ఆధిక్యంలో ఉన్నాడు.

ట్రంప్ కూడా 213 సీట్లతో గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే కొంత సమయానికే ట్రంప్ మాట మార్చారు. పోలింగ్ సమయం దాటిన తర్వాత కూడా ఓట్లు పోలయ్యాయని ఎన్నికల్లో మోసాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు. చివరి క్షణంలో ఓట్ల లెక్కింపులో కుట్రలకు తెరతీస్తున్నారు. నాలుగు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ఆపేయాలి ఈ విషయంలో అవసరమైతే న్యాయం కోసం సుప్రీం ను సైతం ఆశ్రయిస్తామంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Related News