logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

భారత్ – చైనా వ్యవహారంపై కల్పించుకోనన్న ట్రంప్.. కారణమిదే!

భారత్ – చైనా సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్ధఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత్ ధీటుగా సమాధానం చెప్పబోతుందని దేశమంతా ఎదురు చూస్తుంది. ఇప్పటికే కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఈ వ్యవహారంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని పరోక్షంగా కథనాలు రాశాయి.

ఇక హాంకాంగ్, తైవాన్ లు బహిరంగంగానే భారత్ కు సంఘీభావం ప్రకటించాయి. దీనిపై ఇప్పటికే అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని కోరారు. అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అయితే భారత్- చైనా అంశంపై ఈసారి ట్రంప్ జోక్యం చేసుకోవద్దని నిర్ణయించుకున్నారట.

ఈ విషయాన్ని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. గతంలో చైనా – భారత్ మధ్య అనేక సార్లు సరిహద్దు వివాదాలు నెలకొన్నాయి. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చారు. అయితే ఈ సమస్యను తామే తేల్చుకుంటామని అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. అటు చైనా కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ట్రంప్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.

Related News