logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ట్రంప్ కీలక నిర్ణయం… భారతీయులకు మరో షాక్..!

కరోనా లోక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 21 వరకు అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేసే భారతీయులకు హెచ్ 1బీ వీసాలను రద్దు చేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లే 5.25 లక్షల విదేశీయులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

2020 డిసెంబర్ వరకు భారతీయులతో పాటు ఏ దేశానికి చెందిన వారికి కూడా అమెరికాలో ఉద్యోగం దొరకదు. ఈ మొత్తంలో అధికంగా నష్టపోయేది భారతీయులే. ముఖ్యంగా వివిధ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ సిద్ధంగా ఉండి హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది ఐటీ నిపుణులు కూడా ట్రంప్ నిర్ణయంతో అయోమయంలో పడ్డారు.

కరోనా వైరస్ అన్ని దేశాలతో పాటుగా అగ్రరాజ్యమైన అమెరికాను కూడా అతలాకుతలం చేసింది. ఈ సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు తిరిగి ఉపాధి కల్పించే విధంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికాలో నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం నాటికి కనీసం 5 లక్షల మంది మెరికన్లకు ఉపాథి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్.

హెచ్ 1బీ వీసాలతో పాటుగా … హెచ్ 1బీ వీసాలు కలిగి ఉన్న భాగస్వాములకు ఇచ్చే హెచ్ 4 వీసా, కంపెనీల మధ్య బదిలీల కోసం అవసరమయ్యే ఎల్ 1 వీసా, వైద్యులు, పరిశోధకుల కు ఉపయోగపడే జె 1 వీసా లపై కూడా ట్రంప్ నిషేధాన్ని పొడిగించారు. అయితే ఆరోగ్య రంగంతో పాటుగా కరోనా వైరస్ పై పరిశోధనలు జరుపుతున్న నిపుణులకు మాత్రం వీటి నుంచి మినహాయింపునిచ్చారు.

Related News