logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘పక్క రాష్ట్రంలో ఏం చేయలేనోడు ఇక్కడేం చేస్తాడు.. లొట్టపీసు’

నగరం లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు మొదలైంది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. మొదట ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించిన జన సేన పార్టీ ఆ తర్వాత బీజేపీకే తమ మద్దతు అని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిస్సహాయకుడని పక్క రాష్ట్రంలో రెండు స్థానాల్లో గెలవాలని వ్యక్తి దగ్గరకు వెళ్లి మద్దతు తెలపాలని అడుక్కున్నాడని అన్నారు. ”పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడేం చేస్తాడు లొట్టపీసు. విస్తృత ప్రయోజనాల కోసం పోటీ చేయడం లేదట. ఆ మాటలకు జనాలు నవ్వుకుంటున్నార”ని ఎద్దేవాచేశారు.

ఆయనకు ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే ఆయన కూడా ఆ పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. అలాంటి వ్యకిని బీజేపీ కలుపుకోవడం విడ్డూరం. తమ పార్టీ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే బీజేపీలో ఇంకా టికెట్ల లొల్లి తేలలేదన్నారు. మా పార్టీ అభ్యర్థుల్లో 50 శాతం మంది విద్యావంతులు, 50 శాతం మంది యువకులు, 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ వారు ఉన్నారని టికెట్ల కేటాయింపులో తమ పార్టీ సామాజిక న్యాయం పాటించిందన్నారు. తమ పార్టీ గెలిస్తే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుందన్నారు.

Related News