logo

  BREAKING NEWS

ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |  

హై కోర్టు న్యాయవాదుల హత్య.. టీఆర్ఎస్ కీలక నిర్ణయం!

హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ కూడా ఉన్నాడు. తాజాగా శ్రీనివాస్ ను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ హత్యపై ప్రతిపక్షాలు ఆగ్రహం వక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నేతల అండతోనే హత్య జరిగిందంటూ బీజేపీ అధ్యక్ధుడు బండి సంజయ్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హత్యకు సంబంధించి కుంట శ్రీనివాస్, కిరణ్ అక్క పాక కుమార్ లను అరెస్టు చేసినట్టుగా సమాచారం అందుతుంది.

ఈరోజు రాత్రి వీరిద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ హత్య వెనుక దేవాలయం భూముల విషయమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతుండగా.. వామన్ రావు తండ్రి మాత్రం రాజకీయ కారణాలే తమ కొడుకు, కోడలిని పొట్టన పెట్టుకున్నాయని ఆరోపిస్తున్నారు. న్యాయవాదుల హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలకు పిలుపునిచ్చారు.

Related News