logo

  BREAKING NEWS

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |  

మార్చి లోపు ముఖ్య‌మంత్రి మార్పు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యా నాయ‌క్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మార్చి లోపు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేటీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డోర్న‌క‌ల్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రెడ్యా నాయ‌క్ రాష్ట్ర రాజకీయాల‌ను ప్ర‌స్తావిస్తూ కేటీఆర్ మార్చి లోపు ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేటీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌నే వార్త‌లు చాలా రోజులుగా వ‌స్తున్నాయి. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసి కేసీఆర్ ఢిల్లీ వెళ్తార‌ని, జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌వంతు పాత్ర పోషిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. 2018 ఎన్నిక‌ల్లో గెలిచినప్పుడే కేటీఆర్ ముఖ్య‌మంత్రి అవుతార‌నే ఊహాగానాలు వ‌చ్చాయి. కానీ, ఈ విష‌యంలో కేసీఆర్ ఏ మాత్రం తొంద‌ర‌ప‌డ‌టం లేదు.

మొద‌ట కేటీఆర్‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా బాధ్య‌త‌లు ఇచ్చి పార్టీలో నెంబ‌ర్ 2గా మార్చారు. మంత్రివ‌ర్గంలోనూ కేటీఆర్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దీంతో పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ కేసీఆర్ త‌ర్వాత కేటీఆరే అనేలా ప‌రిస్థితి మారింది. ఇటీవ‌ల ప‌లువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కాబోయే ముఖ్య‌మంత్రి కేటీఆర్ అని ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. తాజాగా సీనియ‌ర్ నేత రెడ్యా నాయ‌క్ చేసిన వ్యాఖ్య‌ల‌తో కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రి చేసే దిశ‌గా టీఆర్ఎస్‌లో ఆలోచ‌న‌లు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Related News