logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

టీఆర్ఎస్ కు షాక్: బీజేపీలోకి ఆ మంత్రి సోదరుడు?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల దుబ్బాకలో ఊహించని విధంగా విజయం దక్కించుకున్న బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మరింత బలాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా పార్టీలో అసంతృప్తి నేతలంతా ఇప్పుడు బీజేపీలోకి వెళుతున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలో చేరారు. తాజాగా మరో టీఆర్ఎస్ నేత కమలం గూటికి చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెరాసను వీడి బీజేపీలో చేరనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

గత శుక్రవారమే అందుకు సంబంధించి బీజేపీ నేతలతో చర్చలు జరిగాయని తెలుస్తుంది. కాగా తూర్పు వరంగల్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ప్రదీప్ రావు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి విఫలమయ్యారు. మళ్ళీ టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా ఉన్నారు. కాగా కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన ఎర్రబెల్లి దయాకర్ ఒకరు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది.

Related News