logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

బ్రేకింగ్: కారుతో సహా వరదలో కొట్టుకుపోయిన టీఆర్ఎస్ నేత..!

సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వరద నీటిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ కారుతో సహా వరదలో గల్లంతయ్యారు. కాగా నిన్న రాత్రి శ్రీనివాస తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంథనికి బయలుదేరారు. ఈ క్రమంలో జిల్లాలోని మద్దికుంట వాగు కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతోంది.

శ్రీనివాస్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు వాగు వద్దకు సమీపించగానే వరద ఉహృతి మరింత తీవ్రమయ్యింది. దీంతో కారుతో సహా శ్రీనివాస్ అతని ముగ్గురు స్నేహితులు కొంత దూరం కొట్టుకుపోయారు. కాగా అతనితో ఉన్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు. కానీ శ్రీనివాస్ ను మాత్రం కాపాడలేకపోయారు. ఇన్నోవా వాహనంతో పాటుగా శ్రీనివాస్ కూడా వరద ఉధృతికి గల్లంతైనట్టుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు.

ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ కేటీఆర్ స్పందించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ను అప్రమత్తం చేసారు. ఆయనతో ఫాలో మాట్లాడుతూ గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో సిద్ధిపేట సీఆర్డీవో సహాయక బృందాలతో వాగు వద్దకు చేరుకొని శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related News