మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత లక్ష్మా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రజల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎంత మంచి చేసినా వారు గుర్తుపెట్టుకోరని అందుకే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సీఎం కేసీఆర్ కు చెప్పాలని భావించారన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం చేస్తున్న మంచి తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు. ఎంతో మంది ప్రజలు పనికిమాలిన భావాలకు లోనవుతున్నారు. అందుకే 24 గంటల కరెంటు ను ఆపేసి కేవలం రెండు మూడు గంటలే విద్యుత్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరతానన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేసి ఎన్నికలకు ముందు మళ్ళీ ప్రారంభిస్తే అప్పుడు బాగుంటుందని మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మరోవైపు ఇటీవల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురైనా చేదు అనుభవాలే ఆ పార్టీ నేతలని ఇలా మాట్లాడిస్తున్నాయని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.