logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మనిషి ముఖంతో చేపను చూసి షాకవుతున్న జనం.. ఇదెలా సాధ్యం?

సముద్రం ఎన్నో వింతలు విశేషాలను తన గర్భంలో దాచుకుంటుంది. ఒక్కోసారి అవి బయటపడి మనుషుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి ఘటనే తాజాగా మలేషియా వాసులకు ఎదురైంది. అక్కడి సముద్ర జాలర్లకు ఒక విచిత్తరమైన చేప చిక్కింది. ఈ చేప అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉండటం చూసి షాకయ్యారు.

అయితే ఆ జాలర్లు ఈ చేపకు మనిషి ముఖం ఎలా వచ్చిందో తెలుసుకొవాలని ఆరాటపడ్డారు. అంతటితో ఆగకుండా ఈ చేపను దగ్గర్లోని ఓ పరిశోధనా కేంద్రానికి పట్టుకెళ్లారు. ఈ చేపను పరిశీలించిన అనంతరం పరిశోధకులు దీనికి ట్రిగ్గర్ ఫిష్ గా నామకరణం చేసారు. అయితే ఈ చేపలు ఆగ్నేయ ఆసియా సముద్ర జలాల్లో ఎక్కువగా లభిస్తుంటాయట.

చేపల్లో ఇది కూడా ఒకరకమైన జాతి. అచ్చం మనిషి లాగే పెదవులు, అందమైన పలువరస ఉండటం వీటి ప్రత్యేకత. ఐతే సముద్ర జలాల్లో ఇలాంటి చేపలు కొరకడం ఇది మొదటిసారేమి కాదు. గతంలో కూడా ఈ చేప జాతికి చెందిన అనేకం లభించాయి. కానీ దేనికదే ప్రత్యేకంగా ఉంటూ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అందులో ఇపుడు లభించినది కూడా ఒకటి. ఈ చేప ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టగా కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారాయి.

Related News