logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

గుప్త నిధుల కలకలం.. రైతు పొలంలో బయటపడ్డ లంకె బిందెలు

వికారాబాద్ జిల్లాలో మరోసారి గుప్త నిధులు కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పెరిగి మండలం ఎర్రగడ్డపల్లికి చెందిన యాకుబ్ అలీ తన పొలం చదును చేస్తున్న సమయంలో పురాతనకాలం నాటి రాగి పాత్రలు బయటపడ్డాయి. వాటిని బయటకు తీసి చూడగా లంకె బిందెలుగా గుర్తించారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

పొలంలో లభ్యమైన ఐదు పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లభించిన నిధుల విషయమై పోలీసులు స్థలం యజమానిని విచారిస్తున్నారు. అయితే దొరికిన పాత్రల్లో తనకు ఎలాంటి వెండి, బంగారం దొరకలేదని పొలం యజమాని పోలీసులకు తెలిపినట్టుగా సమాచారం. కాగా వీటిలో కొన్ని బంగారు, వెండి ఆభరణాలు బయటపడినట్టు తెలుస్తుంది. గతంలో వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొలం దున్నే సమయంలో, ఇంటి నిర్మాణాల్లో గుప్త నిధులు లభ్యమయ్యాయి.

Related News