logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

అలర్ట్: వాహనదారులకు షాకిస్తున్న పోలీసులు.. ఇలా దొరికితే అంతే!

వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు షాకిస్తున్నారు. నగరంలో 2009 మోటార్ వెహికిల్ చట్టాన్ని కఠినంగా అమలు పరిచేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం రోడ్డు భద్రతా, హెల్మెట్ వాడకంపై విస్తృతంగా ప్రచారం చేసున్నారు. కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా వాహనదారులు ముఖ్యంగా ద్విచక్రవాహనాలు నడిపే వారిపై నిఘా పెంచారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపించనున్నారు పోలీసులు.హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రోడ్లపై హెల్మెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఒక వేళ రెండోసారి కూడా ఇదే విధంగా హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే శాశ్వతంగా లైసెన్స్ రద్దుచేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వారి వెనకాల కూర్చున్న వారు కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించవలసి ఉంటుంది.

Related News