చిన్న చితకా ట్రాఫిక్ ఉల్లంఘనలకె భారీ చలాన్లు వేసిసామాన్యుల జేబులు గుల్ల చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. అయితే చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి నిరూపించి చూపించారు. అతివేగంతో వాహనాలు నడిపిన కారణంగా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాహనాలకు జరిమానా విధించారు.
ఈ మధ్య ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలు అతివేగంతో ప్రయాణిస్తున్నాయని ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం నాలుగు చలాన్లు రాశారు. జూన్ 1వ తేదీన విధించిన ఫైన్ తో కలుపుకుని మొత్తం రూ.4,140 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. కోదాడ సమీపంలోని శ్రీరంగపురం వద్ద ఒకటి. ఏప్రిల్ నెలలో మాదాపూర్ పరిధిలో రెండోది, తోలి చౌకి, ట్యాంక్ బ్యాండ్ పరిధిలో ఇలా మొత్తం నాలుగు చలాన్లు రాసారు పోలీసులు.
ఈ చలాన్లన్నీ అతి వేగంగా వాహనం నడిపిన కారణంగానే విధించడం గమనార్హం. ముఖ్యమంత్రి వాహనాలకు జరిమానా విధించిన వార్తలు మీడియాలో రావడం వలన సీఎంవో కార్యాలయం వెంటనే వీటిని చెల్లించినట్టు తెలుస్తుంది.