logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

చిలుకూరులో అద్భుతం.. కరోనాపై ప్రపంచం శుభవార్త విననుందా?

హైదరాబాద్ మహానగరానికి శివారు ప్రాంతంలో ఉన్న శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయంలో చోటుచేసుకున్న ఓ వింత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుండి తొందర్లోనే విముక్తి పొందనున్నామని చెప్పడానికి ఇది సంకేతమని ఆలయ అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలియఁగ దైవం వెంటకేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షంగా వెలసినట్టు చెప్తారు. అందులో ఒకటి చిత్తూరు జిల్లా తిరుమల, రెండోది తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల కాగా, మూడోది తెలంగాణ ప్రాంతంలోని చిలుకూరులో అని పురాణాలు చెబుతున్నాయి. 500 ఏళ్ల చరిత్ర ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో తాజాగా ఓ అద్భుతం చోటుచేసుకుంది.

ఆదివారం ఉదయం తెల్లవారుజామున స్వామివారి ఆలయంలో ఓ తాబేలు దర్శనమివ్వడం ఆలయ అర్చకులను విస్మయానికి గురిచేసింది. ఇందులో అద్భుతం ఏముంది అనుకోకండి. ఈ ఆలయంలోకి ఎలాంటి జీవరాశి ప్రవేశించని విధంగా అన్ని మార్గాలను మూసివేస్తారు. అయితే ఈ తాబేలు ఆలయంలోకి ఎలా వచ్చింది? ఎక్కడినుంచి వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. దాదాపు పది సెంటీ మీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పున్న ఈ తాబేలు లోపలి రావడానికి ఎలాంటి చిన్న మార్గం కూడా లేదని ఆలయ అర్చకులు అంటున్నారు. అయితే ఇదొక అద్భుతంగా వారు పేర్కొంటున్నారు.

కరోనా సంక్షోభంతో లోకమంతా ఆపోరాడుతున్న వేళ సాక్షాత్తు కలియుగ వేంకటేశ్వరుడే కూర్మావతారుడి రూపంలో ఇలా ఓ శుభ సూచికాన్ని అందించాడని ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సంక్షోభం నుంచి మానవాళి రక్షింపబడుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేసారు. హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అంటే తాబేలు. పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మావతారం పైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకి అనేటటువంటి సర్పంతో ఒకవైపు దేవతలు ఒకవైపు అసురులు మదించార‌ని.. ఇప్పుడు కూడా క‌రోనా వైర‌స్‌ని జ‌యించ‌డం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తున్న స‌మ‌యంలో చిలుకూరులో సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో కూర్మం ప్ర‌త్య‌క్షం కావ‌డం అంటే.. ఆ వెంకటేశ్వర స్వామి మనకు త్వరలో లోకం నుంచి వైర‌స్ అంత‌మైపోతుంది.. అమృతం లభిస్తుంది అని సూచిస్తున్నట్లుగా ఉంద‌ని చెబుతున్నారు. భక్తులు చేస్తున్న ప్రార్థనలు, వైద్య సిబ్బంది సేవలు, ప్రభుత్వం కృషి.. ఇలా అన్నింటికీ త్వ‌ర‌లోనే మంచి ఫ‌లితం ల‌భిస్తుంద‌ని ఆలయ వర్గాలు తెలిపాయి.

Related News