logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

తెలుగువారిలో అత్యంత ధ‌నికులు వీరే.. క‌ళ్లు చెదిరే ఆస్తులు

అత్యంత సంప‌న్నుల జాబితాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ అనే సంస్థ విడుద‌ల చేసింది. దేశంలో అత్యంత సంప‌న్నుడిగా రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. ఆయ‌న ఆస్తి అక్ష‌రాలా 6.58 ల‌క్ష‌ల కోట్లు. గ‌త ఏడాదిలోనే ముకేశ్ అంబానీ సంప‌ద‌ 73 శాతం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధ‌నికులుగా ముర‌ళీ దివి కుటుంబం నిలిచింది. దివీస్ లేబొరేట‌రీస్ సంస్థ యాజ‌మాని ఆయ‌న‌. ముర‌ళి దివి సంప‌ద 49 వేల కోట్లు. ఏడాదిలో వీరి సంప‌ద ఏకంగా 89 శాతం పెరిగింది.

తెలుగు రాష్ట్రాల సంప‌న్నుల జాబితాలో రెండో స్థానంలో హెటెరో డ్ర‌గ్స్ అధినేత బి.పార్థ‌సార‌థి రెడ్డి కుటుంబం నిలిచింది. వీరి ఆస్తి 13,900 కోట్లు. గ‌త ఏడాదిలో వీరి ఆస్తి 49 శాతం పెరిగింది. మూడో స్థానంలో డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థ యాజ‌మానులు కె.స‌తీశ్ రెడ్డి కుటుంబం ఉంది. వీరి ఆస్తి అక్ష‌రాలా 11,200 కోట్లు. గ‌త ఏడాది కాలంలో వీరి ఆస్తి 60 శాతం పెరిగింది.

నాలుగో అత్యంత ధ‌నికులైన తెలుగువారిగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ యాజ‌మాని పి.పిచ్చిరెడ్డి నిలిచారు. ఆయ‌న ఆస్తి 11,100 కోట్లు. అయితే, గ‌త ఏడాదిలో ఆయ‌న సంప‌ద 17 శాతం త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. ఐదో స్థానంలో కూడా మెఘా ఇంజినీరింగ్ సంస్థ యాజమానుల్లో ఒక‌రైన పీవీ కృష్ణారెడ్డి నిలిచారు. ఆయ‌న సంప‌ద 10,700 కోట్లు. కాగా ఈయ‌న సంప‌ద కూడా గ‌త ఏడాది 17 శాతం మేర‌కు త‌గ్గిపోయింది.

అత్యంత ధ‌నికులైన తెలుగువాళ్ల జాబితాలో ఆరో స్థానంలో డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థ యాజ‌మానులు జీవీ ప్ర‌సాద్‌, జి. అనురాధ నిలిచారు. వీరి సంప‌ద 9,400 కోట్లు. గ‌త ఏడాది కాలంలో వీరి ఆస్తి 59 శాతం మేర‌కు పెరిగింది. వీరి త‌ర్వాత ఏడో స్థానంలో మైహోమ్ ఇండ‌స్ట్రీస్ అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర్‌రావు కుటుంబం నిలిచింది. వీరి కుటుంబం మొత్తం ఆస్తి 8,900 కోట్లు. కాగా, గ‌త ఏడాది వీరి కుటుంబ ఆస్తి కూడా 11 శాతం త‌గ్గిపోయింది.

సంప‌న్నులైన తెలుగువారిలో ఎంఎస్ఎన్ లేబొరేట‌రీస్ సంస్థ యాజ‌మాని ఎం.స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి కుటుంబం ఎనిమిదో స్థానంలో నిలిచింది. వీరి మొత్తం ఆస్తి 8,700 కోట్లు. గత ఏడాది వీరి ఆస్తి 55 శాతం మేర‌కు పెరిగింది. వీరి త‌ర్వాతి స్థానంలో నాట్కో ఫార్మా వీసీ న‌న్న‌ప‌నేని ఉన్నారు. వీరి ఆస్తి 7,500 కోట్లు. ప‌దో స్థానంలో న‌వ‌యుగ ఇంజ‌నీరింగ్ సంస్థ యాజ‌మాని సి.విశ్వేశ్వ‌ర‌రావు కుటుంబం ఉంది. వీరి ఆస్తి 4,900 కోట్లుగా ఉంది. వీరి ఆస్తి గ‌త ఏడాదిలో 22 శాతం త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌గా హైద‌రాబాద్ నుంచే ధ‌న‌వంతులు ఉన్నారు. న‌గ‌రం నుంచి 51 మందికి ఐఐఎఫ్ఎల్ వెల్త్‌ ధ‌న‌వంతుల జాబితాలో చోటు ద‌క్కింది. విశాఖ‌ప‌ట్నం నుంచి ముగ్గురికి, రంగారెడ్డి జిల్లా నుంచి ఒక‌రికి, సికింద్రాబాద్ నుంచి ఒక‌రికి ఈ జాబితాలో స్థానం ద‌క్కింది. కాగా, ఎక్కువ మంది ధ‌న‌వంతులు ఫార్మా ఇండ‌స్ట్రీస్ యాజ‌మానులే కావ‌డం గ‌మ‌నార్హం. మొద‌టి ప‌ది మంది ధ‌నికులైన తెలుగు వారి జాబితా చూస్తే ఆరుగురు ఫార్మా రంగానికి చెందిన వారు ఉన్నారు.

ఈ ఆరుగురి సంప‌ద ఏడాది కాలంలో 40 శాతానికి పైగానే పెరిగింది. ఇంజ‌నీరింగ్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ రంగాలకు చెందిన న‌లుగురు కూడా ధ‌నికులైన తెలుగు వారి టాప్ 10 జాబితాలో ఉన్నారు. కాగా, ఈ న‌లుగురి ఆస్తి గ‌త ఏడాది కాలంలో త‌గ్గ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం.

Related News