మెగా డాటర్ పెళ్లి వేడుకకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ ముస్తాబైంది. కరోనా కారణంగా అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో నిహారిక ఓ ఇంటిదవుతుంది. ఇప్పటికే ఈ వేడుకకు పవర్ స్టార్ తన కుమారుడు అకీరా నందన్ తో కలిసి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
అయితే ఈ వేడుకలో పెద్దగా టాలీవుడ్ సెలెబ్రిటీలు కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నిహారిక పెళ్లి వేడుకల ఫొటోల్లో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు తళుక్కుమన్నారు. నిహారిక పెళ్ళిలో వీరిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలకు టాలీవుడ్ తో సహా అన్ని పరిశ్రమల హీరోయిన్లతో సత్సంబంధాలు ఉన్నాయి.
అయితే ఈ పెళ్ళి వేడుకకు తెలుగు హీరోయిన్ రీతూ వర్మ, లావణ్య త్రిపాఠికి మాత్రమే ఆహ్వానం అందింది. వీరికి మాత్రమే ప్రత్యేకించి ఎందుకు? అంటే వీరిద్దరూ నిహారికకు జిమ్ మేట్స్ అంట. ఈ ముగ్గురు కలిసి ఒకే జిమ్ లో వర్కౌట్స్ చేస్తారు. అలావీరు మంచి స్నేహితులుగా మారిపోయారట. దీంతో ఈ పెళ్ళికి వీరికి మాత్రమే ఆహ్వానం అందింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో లావణ్య త్రిపాఠి తీసుకున్న సెల్ఫీకి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.