టాలీవుడ్ హీరోలంతా లాక్ డౌన్ లో పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో మరో యంగ్ హీరో చేరాడు. నిర్మాత ఎం ఎస్ రాజు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్.’ తూనీగ తూనీగ’, ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా శనివారం హైద్రాబాద్లో సుమంత్ అశ్విన్ వివాహం ఘనంగా జరిగింది. కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. దీపికా అనే అమ్మాయి మెడలో ఈ హీరో మూడు ముళ్ళు వేసాడు. కాగా ఈ హీరో నటించిన ‘ఇదే మా కథ’ అనే సినిమా మార్చి 19న విడుదలకు సిద్ధం కానుంది.