బిగ్ బాస్ పుణ్యమా అని మూడు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ ఒక్క షోతో సంపాదించుకుంది మోనాల్ గజ్జర్. తన అందంతో కుర్ర కారును కట్టిపడేసింది. ఇక వీకెండ్స్ లో తన డ్రెస్సింగ్ సెన్స్ తో యూత్ ను టీవీలకు అతుక్కునేలా చేసింది ఈ బ్యూటీ. అయితే మోనాల్ బిగ్ బాస్ లో చేసిందేమీ లేదని మిగిలిన వారితో పోలిస్తే ఆమె గేమ్ పరంగా అంత పెరఫార్మెన్స్ ఏమీ చేయాలదనే విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే అభిజిత్, అఖిల్ తో మోనాల్ ట్రయాంగిల్ లవ్ ట్రాక్, మోనాల్ గ్లామర్ కోసమే ఆమెను షో నిర్వాహకులు ఇన్ని రోజులు హౌస్ లో ఉండనిచ్చారని అంటారు. అయితే ఇక ఆమెకు సపోర్ట్ చేసిన హోస్ట్ నాగార్జున కూడా విమర్శలలు ఎదుర్కోక తప్పలేదు. ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు మోనాల్ ను క్రేజీ అఫర్ వరించింది. యువ హీరో బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఆమెను ఏకంగా ఐటెం గర్ల్ గా నటింపజేస్తున్నారు.
గతంలో తమన్నా లాంటి హీరోయిన్లు బెల్లంకొండతో ఐటం సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ షోతో మోనాల్ కు వచ్చిన క్రేజ్ చూసి ఇప్పుడు ఆమెతో ఓ పాటకు స్టెప్పులు వేయించనున్నారట మూవీ టీమ్. అందుకోసం మోనాల్ కు ఏకంగా ఒక్కరోజుకు రూ. 15 లక్షల పారితోషకాన్ని అందిస్తున్నారట