logo

  BREAKING NEWS

బ్రేకింగ్: కరోనాతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి..!

సినీ పరిశ్రమను కరోనా కలవరపెడుతుంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కరోనాతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి చెందడంతో పరిశ్రమలో విషాదం నెలకొంది. నిర్మాత పోకూరి రామారావు(64) ఈరోజు ఉదయం కరోనాతో కన్నుమూశారు. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా అయన హోమ్ ఐసోలేషన్ ఉంటూ చికిత్స పొందుతున్నారు. కాగా ఆరోగ్యం విషమించడంతో మరణించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం. పోకూరి రామారావు ఆయన సోదరుడు పోకూరి బాబురావు ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలని తెలుగు పరిశ్రమకు అందించారు. నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం వంటి అనేక విజయవంతమైన సినిమాలను ఈతరం బ్యానర్స్ ద్వారా తెరకెక్కించారు. కాగా రామారావు అకాల మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

Related News