logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఒక్క తప్పుతో అర్థాంతరంగా కెరీర్ ముగిసిపోయిన టాలీవుడ్ హీరోయిన్లు వీరే!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. వెండి తెరపై హీరోయిన్ గా ఒక్కసారి కనిపిస్తే చాలు లక్కు బావుంటే ఓవర్ నైట్ లో సెలబ్రిటీలైపోతారు. సొసైటీలో ఎక్కడ లేని గౌరవం, అటెన్షన్, డబ్బు లభిస్తాయి. కానీ ఆ అదృష్టం ఒక్కొక్కరినీ ఒక్కోలా వరిస్తుంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వారంతా సుఖమయ జీవితం గడుపుతున్నారంటే అది అబద్దమే అవుతుంది. కొన్ని సార్లు వారిపై వచ్చే రూమర్లు హీరోయిన్ల పాలిట శాపాలుగా మారుతాయి. దీంతో వారి ఇమేజ్ పడిపోతుంది. అప్పటివరకు స్టార్లుగా వెలిగినవారంతా సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా వివాదాల కారణంగా సినీ కెరీర్ ను అర్థాంతరంగా ముగించిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.

‘మౌనపోరాటం’ సినిమాతో తెలుగు తెరపై మంచి గుర్తింపుతెచ్చుకున్నారు నటి యమున. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు కుటుంబం వారిది. హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటుగా బుల్లితెరపై కూడా అనేక సీరియళ్ళలో నటించారు. 2011 లో బెంగుళూరు లోని ఓ హోటల్ లో వ్యబిచారం చేస్తూ యమున పట్టుబడ్డారని టీవీలు, పత్రికల్లోవార్తలు వచ్చాయి.

దీంతో ఆమె ఎన్నో పోరాటాలు చేసి చివరికి తను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకున్నా, దాని మీద ఎక్కడా వార్త లేదు. అయితే ఆ కేసులో తనని కావాలనే ఎవరో ఇరికించారని, ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, చచ్చిపోవాలని కూడా నిర్ణయించుకున్నానని యమున ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన తర్వాత ఆమె సినీ కెరీర్ దాదాపు ముగిసిందనే చెప్పాలి. యమున ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాల్లో నటిస్తున్నారు.

తెలుగు, తమిళ సినిమాల్లో వ్యాంప్ పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్న నటి భువనేశ్వరి అంటే తెలియని వారుండరు. 2009 లో భువనేశ్వరి వ్యభిచారం కేసులో అరెస్టు అయ్యారు. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటం వల్లే ఆమె అప్పట్లో బయటపడిందని సమాచారం. కానీ ఇదే కేసులో మరోసారి రెడ్ హ్యాండెడ్ గా భువనేశ్వరి అరెస్టు కావడంతో కోర్టులో హాజరుకావలసి వచ్చింది. ఈ నెట్ వర్క్ లో తనతోపాటుగా మరికొందరు సినీ స్టార్లు ఉన్నారని ఆమె చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.

‘చెట్టు క్రింద ప్లీడర్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి, టీవీ సీరియల్స్ లో ఒక వెలుగు వెలిగిన కిన్నెర టీవీ 9 ఛానెల్ చేసిన ఓ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది. సినిమా ఛాన్సులు కోసం వచ్చే అమ్మాయిలను నిర్మాతలు, ఫైనాన్సియర్స్ కు ఎర వేసి డబ్బు సంపాదించటంలో ఆరి తేరిందని రుజువైంది.

‘పెద్దరికం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి సుకన్య. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ భార్య పాత్రలో అద్భుతంగా నటించారు. 2014 లో సుకన్య కూడా వ్యభిచారం కేసులో ఇరుక్కున్నారు.ఈ వార్తలు ఆమె అభిమానులను తీవ్రంగా కలచివేశాయి.
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్, తెలుగు నటీమణులు సైరా భాను, జ్యోతి కూడా అప్పట్లో వ్యబిచారం కేసులోనే పట్టుబడ్డారు.

Related News