దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో సిద్దార్థ్ కూడా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై సెటైర్లు వేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు.
అందులో పెరుగుతున్న ధరలపై నిర్మల సీతారామన్ గతంలో చేసిన వ్యాఖ్యలు, తాజా వ్యాఖ్యలను జత చేసిన ఒక వీడియో క్లిప్ ను షేర్ చేసాడు. ‘తాను అనుకున్నదే నమ్మే విషయంలో మామి నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నారు. ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు, నైతిక విలువలు కూడా లేవు. మామి రాక్స్’ అంటూ సెటైర్లు వేశారు. సామాజిక, రాజకీయ అంశాలపై నటుడు ప్రకాష్ రాజ్ తరహాలోనే సిద్దార్థ్ కూడా తనదైనా శైలిలో స్పందిస్తుంటారు.
ఇదిలా ఉండగా పెరుగుతున్న డీజిల్ ధరలపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ అంశంపై ఇటీవల నిర్మలా సీతారామన్ స్పందించిన తీరు మరింత వివాదానికి కారణమవుతుంది. పెరుగుతున్న ధరలను నియంత్రించాలంటే ధరలను తగ్గించడం మాత్రమే పరిష్కారం అని ఆ బాధ్యత ఆయిల్ కంపెనీలదేనని ఆమె వ్యాఖ్యలు చేసారు.
#NirmalaTai Then & Now. Lies & Hypocrisy personified! pic.twitter.com/LUrxOrbGFM
— Prashant Bhushan (@pbhushan1) February 22, 2021