logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో, నిర్మాత?

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో ఓ టాలీవుడ్ యువ హీరో పేరు కీలకంగా వినిపిస్తుంది. ఈ కేసులో తాజాగా హీరో తనీష్ తో పాటుగా మొత్తం ఐదుగురికి బెంగుళూరు పోలీసులు నోటీసులు పంపించారు. వీరంతా సిట్ ఎదుట విచారణకు హాజరు ఆదేశించారు.

2017 లో టాలీవుడ్ పరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ వివాదం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బెంగుళూరులో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో పోలీసులు విదేశీయులను అరెస్టు చేశారు. విచారణ సందర్బంగా వారి ద్వారా మస్తాన్, విక్కీ మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నిర్మాత శంకర్ గౌడ పేరు వెలుగులోకి వచ్చింది.

నిర్మాత శంకర్ గౌడ తన ఆఫీసుల్లో పార్టీలు నిర్వహిస్తాడని, ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు వచ్చి వెళ్తుంటారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో శంకర్ గౌడ పార్టీలకు హాజరైన వారందరికీ సిట్ అధికారులు నోటీసులు పంపిస్తున్నారు. అయితే
హీరో తనీష్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం ఇది రెండవసారి కావడం గమనార్హం.

తనీష్ కు నోటీసులు జారీ చేసిన విషయాన్ని బెంగుళూరు పోలీసులు తాజాగా నిర్దారించారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, తాను హైద్రాబాద్ లోనే ఉన్నానని ఎలాంటి పార్టీలకు హాజరు కాలేదని తనీష్ చెప్తున్నాడు. బాలనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తనీష్ ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు నిరాశపరచడంతో కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.

 

Related News