logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మీరే మా నిజమైన హీరో.. వీర జవాన్లకు టాలీవుడ్ నివాళి!

భారత్- చైనా సరిహద్దు ఘర్షణల్లో గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశ ప్రజలంతా నివాళులు అర్పిస్తున్నారు. మీ త్యాగం మరువలేనిదంటూ కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు మరణం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. సంతోష్ బాబు మరణంపై సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మీరు మా నిజమైన హీరో అంటూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

‘భారత సైనికులు మరణించారన్న వార్తతో విషాదంలో మునిగిపోయాను. ఆ సంఘటన నన్ను కలచివేస్తుంది. వీర జవాన్ల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీ దేశభక్తి, ధైర్య సాహసాలకు మా సెల్యూట్. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ టాలీవుడ్ హీరో మహేష్ బాబు సంతాపం వ్యక్తం చేసారు.

‘దేశం కోసం ప్రాణాలను అర్పించిన సూర్యాపేట వాసి, కల్నల్ బి. సంతోష్ బాబు ఇతర జవాన్లకు నా సెల్యూట్. చైనా వక్ర బుద్ధిపై రక్తం మరిగిపోతుంది. వారిని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. టిక్ టాక్ తో పాటుగా చైనా వసువులను బ్యాన్ చేయండి’ అంటూ హీరో నిఖిల్ సిద్దార్థ ట్వీట్ చేసారు.

‘మన భద్రత కోసం ప్రాణాలర్పించిన గల్వాన్ వ్యాలీ వీరులకు నా సెల్యూట్. వారి మరణంతో నా గుండె ముక్కలైంది. వారి ఆత్మలకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ తమన్నా భాటియా ట్వీట్ చేసి సంతాపం తెలిపారు.

‘దేశ సరిహద్దులో శత్రు సేనలతో పోరాడుతూ వీరమరణం పొందిన సైనికులకు నా ప్రగాఢ సంతాపం. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగంతో నా హృదయం భారంగా మారింది. వీర మరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని అనిల్ రావిపూడి సంతాపం వ్యక్తం చేశారు.

Related News