logo

రియా పార్టీలో తెలుగు హీరోహీరోయిన్లు.. డ్ర‌గ్స్ లింకులు సైతం..!

టాలీవుడ్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. రెండేళ్ల క్రితం ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చి, విచార‌ణ‌కు కూడా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి టాలీవుడ్ హీరోహీరోయిన్ల పేర్లు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న రియాకు డ్ర‌గ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న‌ట్లు తెలింది.

దీంతో ఆమెను అరెస్ట్ చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు. విచార‌ణ‌లో ఆమె 25 మంది డ్ర‌గ్ వినియోగ‌దారుల పేర్లు చెప్పింది. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు ఉన్న‌ట్లు తెలుస్తోంది. రియా ఫోన్ కాల్ డేటాలోనూ ప‌లువురు టాలీవుడ్ హీరో, హీరోయిన్ల నెంబ‌ర్లు ఉన్న‌ట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. రియాతో వీరికి మంచి స్నేహం ఉంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, రియా ముంబైలో నిర్వ‌హించిన ప‌లు మిడ్‌నైట్ పార్టీల‌కు కూడా ప‌లువురు తెలుగు హీరో, హీరోయిన్లు హాజ‌ర‌య్యేవారు.

మొత్తం డ్ర‌గ్స్ వినియోగిస్తున్న 25 మంది ప్ర‌ముఖుల పేర్ల‌ను రియా వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. వీరిలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ పేరు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆమె చెప్పిన 25 మందిని ఎన్సీబీ విచారించే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా, డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ 2017లో డ్ర‌గ్స్ వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం.

Related News