logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్!

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడ్డారు. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తనకు కరోనా సోకిన విషయాన్ని నిర్దారించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తాను ఓ సినిమా షూటింగ్ సందర్భంగా కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని వెల్లడించింది.

అయితే తానిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని విశ్రాంతి తీసుకుంటున్నానని ఆమె పేర్కొంది. కాగా ఇప్పటివరకు తనను కలిసినవారు, తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. ఇటీవల రకుల్ ప్రీత్ ను వరుస వివాదాలు వెంటాడుతున్న వేళ ఆమెకు కరోనా రూపంలో మరో షాక్ తగిలింది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో ఓ సినిమా చేయనుండగా తెలుగులో దర్శకుడు క్రిష్ తో మరో సినిమాలో నటించనుంది.

Related News