logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

40 దాటినా పెళ్లి చేసుకొని తారలు.. కారణం తెలిస్తే కళ్లు చెమరుస్తాయి

సినీ పరిశ్రమలో నటీమణులు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం సాధారణ విషయమే. కొన్ని సార్లు సినిమాల్లో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాక ఏ బిజినెస్ మ్యాన్ నో లేక సహా నటులనో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో అడుగు పెడుతుంటారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలైపోతారు. సమయం ఉంటె సెకండ్ ఇనింగ్స్ మొదలు పెడతారు. లేదంటే తెరపై కనుమరుగవుతారు. కానీ కొందరు తారలు జీవితంలో అసలు పెళ్లే వద్దని నిర్ణయించుకున్నారు. వారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారాణాలు తెలిస్తే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి. ఆ నటీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దూరదర్శన్ సీరియళ్లతో కెరీర్ మొదలు పెట్టిన నటి రాగిణి తన 37 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలు, సీరియళ్ళలో నటించారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం అడుగడుగునా కష్టాలు ఎదుర్కొన్నారు. పన్నెండేళ్ల వయసులోనే రాగిణికి ఓ వ్యక్తితో పెళ్లి చేశారు. ఏడాదికే భర్తతో విడిపోయారు. అప్పటికే ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. డబ్బుపై వ్యామోహంతో భర్త ఆమెను అడ్డదారులు తొక్కించే ప్రయాత్నం చేసాడు. అది ఇష్టం లేని ఆమె కొడుకుతో బయటకు వచ్చేసారు. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ సోదరి పిల్లలను, కొడుకుని చదివించి వారిని ప్రయోజకులను చేసారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన నటి రజితది మరో కథ. చిన్నప్పుడే ఆమె తన తండ్రిని కోల్పోయారు. కష్టపడి చదువుకున్నారు. ఎప్పటికైనా డాక్టర్ కావాలనేది ఆమె కల. అయితే అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రజిత. నటి కృష్ణవేణికి రజిత అక్క కూతురు. అలాగే నటి రాగిణి రజితకు పిన్ని అవుతారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఇష్టం లేకపోయినా ఆమె నటనను ఎంచుకున్నారు. అయితే ఆధ్యాత్మిక భావాలకు ఆకర్షితురాలైన రజిత పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు.

హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సితార ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు.కేరళకు చెందిన నాయర్ కుటుంబంలో జన్మించారు. అప్పట్లో సితార నటుడు మురళితో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన ఎవరో కాదు. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో నటించిన అధర్వ తండ్రి. కానీ ఆ బంధం పెళ్లి పీటల వరకు వెళ్లకపోవడంతో సితార పెళ్ళికి దూరంగా ఉండిపోయారు.

వీరు మాత్రమే కాదు లేడీ కమెడియన్ కోవై సరళ కూడా కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. నలుగురు సోదరీమణులు, ఒక సోదరుడిని చదివించి పెళ్లిళ్లు చేసారు. వారి పిల్లలను కూడా చేరదీశారు. అయితే తర్వాత వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఆమెను బాధించాయి. దీంతో జీవితంలో పెళ్లి చేసుకోకూడదని ఆమె నిర్ణయించుకున్నారు.

 

Related News