logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

మళ్ళీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు 12.03.2021 బంగారం ధరలు

తెలుగు రాష్ట్రలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో మార్చి 12, అంటే శుక్రవారం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం… ముందుగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధరపై నిన్నటితో పోలిస్తే రూ. 350 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,150గా ఉంది. అదే ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,215 గా ఉంది.

ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. నిన్నటి ధరతో పోలిస్తే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరపై రూ. 380 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,980 గా ఉంది. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 4,598 గా ఉంది. పెరిగిన బంగారం ధరలు హైద్రాబాద్ తో పాటుగా విశాఖ పట్నం, విజయవాడ, బెంగుళూరులో కూడా ఇదే విధంగా ఉన్నాయి.

ఇక వెండి ధర విషయానికొస్తే.. హైద్రాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 73,200 గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరపై రూ. 1,800 గా ఉంది. ప్రస్తుతం తులం వెండి ధర రూ. 732 గా ఉంది.

Related News