దిగొస్తున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ధరలు స్థిరంగా కొనసాగాయి. వెండి ధర మాత్రం స్థిరంగా కనసాగింది. మార్చి 28 వ తేదీన అంటే ఆదివారం నాటి మార్కెట్ ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర,, 10 గ్రాములు రూ.41,910 ఉంది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,191 ఉంది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,720 ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,572 ఉంది.
హైద్రాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,300
గా ఉంది. ప్రస్తుతం తులం వెండి ధర రూ. 693 గా ఉంది. బంగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు బంగారం కొనేముందు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.