రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఊరట లభించింది. తాజాగా మంగళవారం రోజున బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే వెండి మాత్రం పైపైకి కదులుతుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగా కొనసాగింది. దీంతో రేటు రూ.45,830 వద్దనే ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,583 గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.42,010 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,201 కు లభిస్తుంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధర కేజీకి రూ.300 పైకి పెరిగింది. దీంతో రేటు రూ.71,700 కు చేరింది. ఇక బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అయితే బంగారం ధరలు వివిధ అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులు బంగారం కొనే ముందు ధరలను మరొక్కసారి పరిశీలించుకోవాలి.