బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే. దీంతో కొనుగోలుదారులు బంగారం కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే రెండు రోజులుగా బంగారం ధరలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు మరోసారి బంగారం ధర పెరిగింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ అంటే మార్చి 11 గురువారం రోజున బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
హైదరాబాద్ మార్కెట్లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,600 ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.160 పెరిగింది. ఒక్క గ్రాము మేలిమి బంగారం ధర రూ.4,560గా ఉంది. అదే సమయంలో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.41,800 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.150 తగ్గింది. ఒక్క గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,180గా ఉంది.
హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడలోనూ బంగారం ధరలు ఇవే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,400 ఉంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.300 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.714గా ఉంది. బంగారం ధరలు అనేక దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి, ధరలను కొనేముందు మళ్లీ పరిశీలించుకుంటే మంచిది.