logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

ట్రంప్ ఎఫెక్ట్.. టిక్ టాక్ సంస్థకు ఊహించని షాక్..!

టిక్ టాక్ కు ఏ దేశంలో లేనంత క్రేజ్ భారత్ లోఉంది. చైనాతో సరిహద్దు ఘర్షణల దృష్ట్యా భారత్ ఈ యాప్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అటు అమెరికాలోను జాతీయ భద్రతకు ముప్పు కారణంగా కాలిపోర్నియాకు చెందిన ఈ యాప్ ను దాని మాతృ సంస్థ అయిన బైట్ డాన్స్ ను నిషేధిస్తున్నట్టుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో టిక్ టాక్ కు తాజాగా మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. టిక్ టాక్ సీఈవో కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు లేఖ రాస్తూ.. నేను సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాను ఈ విషయం మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నాను అని వెల్లడించారు. డిస్నీ సంస్థలో సుదీర్ఘ కాలం ఓని చేసిన కెవిన్ అనంతరం బైట్ డాన్స్ లో గతేడాది చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నారు. 

టిక్ టాక్ ను నిషేధిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసిన కొద్దీ రోజుల్లోనే కెవిన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. ఇక కెవిన్ తర్వాత టిక్ టాక్ సంస్థకు జనరల్ మేనేజర్ గా వ్యవహరిస్తున వెనెస్సా పప్పాస్ తాత్కాలికంగా ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. 

 

 

Related News