logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆల‌యం మూసి ఉన్నా శ్రీవారి హుండీకి డ‌బ్బులు వ‌స్తున్నాయి

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం, లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఆల‌యాల‌పైన కూడా ప‌డింది. దేశ‌వ్యాప్తంగా అన్ని ఆల‌యాలు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌డం లేదు. భ‌క్తుల‌కు ఎంతో ప్ర‌తీపాత్ర‌మైన క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో కూడా భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం లేదు. మార్చి 20వ తేదీ నుంచి భ‌క్తులు లేకుండానే స్వామి వారికి పూజా కైంక‌ర్యాలు జ‌రుగుతున్నాయి. అయితే, నిత్యం వేలాది మంది స్వామివారిని ద‌ర్శించుకొని వారికి తోచింది హుండీలో వేసేవారు. ఇలా స్వామివారి హుండీ ఆదాయం ప్ర‌తీరోజూ ల‌క్ష‌ల్లో ఉంటుంది.

ఇప్పుడు లాక్‌డౌన్ కార‌ణంగా ఆల‌యంలోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంతో హుండీ ఆదాయం కూడా ఆగిపోయింది. అయితే, శ్రీవారి ప‌ట్ల భ‌క్తితో కొంద‌రు భ‌క్తులు లాక్‌డౌన్‌లోనూ ఈ-హుండీ ద్వారా డ‌బ్బుల‌ను స్వామి వారికి స‌మ‌ర్పించుకుంటున్నారు. ఏప్రిల్ నెల‌లో ఈ-హుండీ ద్వారా టీటీడీకి రూ.1.97 కోట్లు వ‌చ్చాయి. గ‌త సంవ‌త్స‌రం ఏప్రిల్‌తో పోల్చుకుంటే ఈసారి 18 ల‌క్ష‌లు ఈ-హుండీలో ఎక్కువ‌గా డ‌బ్బులు వ‌చ్చాయి. గ‌త ఏప్రిల్‌లో టీటీడీ ఈ-హుండీకి 1.79 కోట్లు వ‌చ్చాయి. భ‌క్తులు టీటీడీ వెబ్‌సైట్‌లోని ఈ-హుండీ ఆప్ష‌న్ ద్వారా స్వామివారి హుండీలో డ‌బ్బులు వేస్తున్నారు.

కాగా, భ‌క్తుల‌కు పెద్ద ఎత్తున శ్రీవారి ల‌డ్డూల‌ను స‌గం ధ‌ర‌కే అందించాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. రూ.50 ల‌డ్డూను రూ.25కే అందించేందుకు సిద్ధ‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లా కేంద్రాల్లోకి టీటీడీ కార్యాల‌యాలు లేదా టీటీడీ క‌ళ్యాణ‌వేదిక‌ల్లో త్వ‌ర‌లో ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు అందించ‌నున్నారు. హైద‌రాబాద్‌, చెన్నై, బెంగుళూరులోనూ ల‌డ్డూలు భ‌క్తుల‌కు అందించేందుకు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల అనుమ‌తి కోసం టీటీడీ సంప్ర‌దిస్తోంది.

Related News