logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఫేస్ ఫ్యాట్, డబుల్ చిన్ తగ్గడం లేదా? ఇలా చేసి చూడండి!

చూడటానికి కొంచెం బొద్దుగా ఉన్న వారిలో సహజంగానే ముఖంపై కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అది సమస్యేమీ కాకపోయినా కొన్ని సందర్భాలలో ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు ఏ కార్యక్రమమైనా సెల్ఫీలు తీసుకోవడం సాధారణ విషయంగా మారిపోయింది. ఇలాంటి సందర్భాలలో ఫేస్ ఫ్యాట్ ఉన్న వారి రూపు రేఖలు ఫొటోల్లో మారిపోయి కనిపిస్తాయి.

అంతే కాకుండా డబుల్ చిన్ ఉంటె అది వెంటనే ఆ ఫొటోలో కనిపించేస్తుంది. దీంతో ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అయితే ఫేస్ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి సాధారణంగా మనం చేసే వ్యాయామాలు సరిపోవు. బరువు తగ్గినా కొంత మందిలో డబుల్ చిన్ అలాగే ఉండిపోతుంది. అందుకే వీటి కోసం కొన్ని మార్పులను చేసుకుంటే సరిపోతుంది.

ఫెషియల్ ఫ్యాట్ ను తగ్గించేందుకు ప్రత్యేకించి కొన్ని ఎక్సర్ సైజులు ఉన్నాయి. దీనినే ముఖ వ్యాయామం అంటారు. అంటే ముఖంలోని కండరాలను కదిలించడం. ఉదాహరణకు నాలుకను 10 సెకన్ల పాటు బయటకు ఉంచాలి. అప్పుడు మీ గెడ్డం, మెడ దగ్గర ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటి కొన్ని వ్యాయామాలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. రోజుకి 20 నిమిషాల పాటు వీటిని ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇక మగవారిలో మద్యం తాగే అలవాటు ఉంటె ముఖం దగ్గర కొవ్వు పెరిగిపోతుంది. దీని వల్ల కొన్ని సార్లు ఉన్న వయసుకన్నా ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఒక గ్లాసు మద్యం కన్నా ఎక్కువ తాగకూడదు. ఎక్కువగా నీటిని తాగడం వల్ల ఈ పరిస్థితిని బ్యాలెన్స్ చేయవచ్చు. అలాగే ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి.

రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. అంటే ఫైబర్ ను తొలగించిన పదార్థాలు. వైట్ బ్రేడ్, వైట్ రైస్, చక్కర, సోడాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారు. ఫలితంగా ముఖంపై కూడా ఫ్యాట్ చేరుతుంది. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ఇలా చేయడం వల్ల వెంటనే ఫలితాలు కనిపించవు కానీ క్రమం తప్పకుండా చేయడం వల్ల కచ్చితంగా ఫలితం ఉంటుంది.

Related News