logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

ఒంట్లో నీరు తగ్గాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు

కొంద‌రికి ఒంట్లో వేడి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వేడి వ‌ల్ల క‌డుపులో, ఛాతిలో మంట రావ‌డం, ముఖంపై, శ‌రీరంపై కురుపులు కావ‌డం, కాళ్లు ప‌గ‌ల‌డం, క‌ళ్లు మండ‌టం, మూత్రంలో మంట‌, విరోచ‌నంలో ర‌క్తం ప‌డ‌టం వంటి అనేక స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి. వేడి వ‌ల్ల క‌లిగే ఈ స‌మ‌స్య‌లు మ‌నిషికి చిరాకు పుట్టిస్తాయి. ఏ ప‌ని చేయ‌నివ్వ‌వు. ఒంట్లో వేడి వ‌ల్ల చాలా ఆహార ప‌దార్థాల‌కు కూడా దూర‌మ‌వుతారు.

కొంద‌రు ప్ర‌తీ రోజూ టీ తాగ‌కుండా ఉండ‌లేరు. మ‌రికొంద‌రికి చికెన్‌, గుడ్లు చాలా ఇష్టంగా తింటారు. కానీ, వేడి అవుతుంద‌నో, వేడి అయ్యింద‌నో ఇలాంటి ఇష్ట‌మైన ఆహారాల‌న్నీ వ‌దిలేసుకుంటారు. తేనె, బొప్పాయి, ఖ‌ర్జూరం వంటి శ‌రీరానికి మంచి చేసే ఆహారానికి కూడా ఈ వేడి అవుతుంద‌నే భ‌యంతోనే దూర‌మ‌వుతారు. సీజ‌న్‌లోనే దొరికే అద్భుత‌మైన మామిడి పండ్ల‌ను కూడా కొంద‌రు వేడి అవుతుంద‌నే భ‌యంతోనే తిన‌రు. చాలా మంది ఈ ఒంట్లో వేడి స‌మ‌స్య వ‌ల్ల బాధ‌ప‌డుతుంటారు.

అయితే, మ‌నం తినే ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవ‌డంతో పాటు చిన్న చిన్న చిట్కాల‌ను పాటిస్తే ఒంట్లో వేడిని త‌గ్గించుకోవ‌చ్చు. ఒంట్లో వేడి త‌గ్గించుకోవాలంటే ముందు అస‌లు ఒంట్లో వేడి ఎందుకు ఎక్కువ‌వుతుందో అర్థం చేసుకోవాలి. ఒంట్లో వేడి పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం శ‌రీరానికి కావాల్సిన‌న్ని నీళ్లు తాగ‌క‌పోవ‌డం. శ‌రీరంలో నీరు త‌గ్గిన‌ప్పుడు వేడి పెరుగుతుంది.

కాబ‌ట్టి నీళ్లు ఎక్కువ తాగ‌డ‌మే ఒంట్లో వేడి త‌గ్గించుకునేందుకు అద్భుత‌మైన‌, వేగంగా ప‌ని చేసే చిట్కా. ఒక మ‌నిషి ప్ర‌తీ రోజు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు క‌నీసం 5 లీటర్ల నీళ్లు తాగాలి. ఉద‌యం లెవ‌గానే రెండు విడ‌త‌లుగా లీట‌ర్ నీళ్లు తాగాలి. త‌ర్వాత ప్ర‌తీ గంట‌కు ఒక గ్లాసు చొప్పు నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతో శ‌రీరానికి ఎప్పుడూ కావాల్సినంత నీరు ఉంటుంది.

మూత్రం ఎక్కువ వ‌స్తుంద‌నే ఇబ్బందితో చాలామంది నీళ్లు త‌క్కువ తాగుతుంటారు. ఇటువంటి వారికే ఎక్కువ ఒంట్లో వేడి చేస్తుంది. ఒంట్లో వేడిని త‌గ్గించేందుకు దివ్యౌష‌దంలా ప‌ని చేసేవి కొన్ని ఉంటాయి. ముఖ్యంగా మెంతులు వేడి త‌గ్గించేందుకు బాగా ప‌ని చేస్తాయి. మ‌న వంట‌ల్లో మెంతులు క‌చ్చితంగా వాడాలి. వేడి ఎక్కువ‌గా ఉన్న వారు రోజుకు రెండు గ్లాసుల నిమ్మ‌ర‌సం తాగితే కూడా వేడి త‌గ్గిపోతుంది.

గంధానికి వేడి త‌గ్గించే శ‌క్తి ఉంటుంది. చ‌ల్ల‌టి నీరు లేదా పాల‌తో గంధం క‌లిపి నుదుట రాసుకుంటే వేడి త‌గ్గిపోతుంది. సీజ‌న్‌ను బ‌ట్టి పుచ్చ‌కాయ‌, క‌ర్భూజ‌, కీర దోస‌కాయ తిన‌డం ద్వారా కూడా వేడిని త‌గ్గించుకోవ‌చ్చు. శ‌రీరానికి చ‌లువ చేసే గుణం పూదీన‌లో ఉంటుంది. పూదీన జ్యూస్ తాగ‌డం మంచిది. వేడిని సులువుగా త‌గ్గించుకునే ఈ ఆహారం విరివిగా అందుబాటులో ఉంటుంది. కాబ‌ట్టి, ఒంట్లో వేడి వ‌ల్ల ఇబ్బంది ప‌డ‌కుండా ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే చాలు.

Related News