logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

10 రోజుల్లో పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగించే టిప్స్

పొట్ట తగ్గించుకోవడం కోసం ప్రతి రోజు అనేక విషయాలను ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటారు చేస్తుంటారు. కానీ వాటిని ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతారు. అందుకు కారణాలు లేకపోలేదు. బరువు తగ్గడానికి చేసిన అనేక ప్రయత్నాల్లో ఒక్కటి కూడా సక్సెస్ కానప్పుడు సాధారణంగానే మరోసారి ఆ మోటివేషన్ లభించదు. కానీ సరైన పద్దతలో చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదు. 10 రోజుల్లో నడుము చుట్టూ ఉన్న కొవ్వును ఐస్ లా కరిగించే కొన్ని రెమిడీస్ ఉన్నాయి. పక్కా ప్రణాళికతో వాటిని ఆచరిస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అవేమిటో ఇపుడు చూద్దాం..

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మన శరీరంలోని ఇతర భాగాల్లో ఉండే కొవ్వు కన్నా చాలా కఠినంగా ఉంటుంది. అందుకే పొట్ట తగ్గించుకోవడం చాలా మందికి కష్టంగా మారుతుంది. ఎంతటి బాణ పొట్టైనా తగ్గించే శక్తి ఒక్క వ్యాయామానికే ఉంది. కఠినమైన వ్యాయామాలు చేయలేని వారు సులువుగా ఉండే ఆసనాలను ఎంచుకోవచ్చు. అందులో పైలెట్స్ అనేది పొట్ట తగ్గడానికి చేసే ఒక వ్యాయామం. ఈ వర్కౌట్ చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కండరాలకు ఎలాస్టిసిటీ లభిస్తుంది. సులువుగా కొవ్వు కరుగుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి వాపులు తగ్గుతాయి. పొట్ట దగ్గరున్న కొవ్వు కరగడమే కాకుండా మంచి శరీరాకృతి లభిస్తుంది.

రెండవది ప్లాంక్. ఇది కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. రోజులో ఎప్పుడైనా ఈ ఎక్సర్సైజ్ చేయవచ్చు. క్రమం తప్పకుండా వీటిని ప్రయత్నిస్తే పది రోజుల వ్యవధిలోనే పొట్ట దగ్గర కొవ్వు కరగడం మొదలవుతుంది. వీటితో పాటుగా మంచి నీటిని ఎక్కువగా తాగాలి. ఇది అందరూ చెప్పేదే అయినా పాటించేవారికి మాత్రమే దీని అద్భుతమైన ఫలితాలు తెలుస్తాయి. మంచి నీళ్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి అధిక కొవ్వును పేరుకోకుండా చేస్తాయి. శరీరం కాంతివంతంగా మెరుస్తుంది.

ఇవి ప్రయత్నించే వారు ఒత్తిడి తగ్గించుకోవాలి. లేదంటే ఆ కారణంగా ఎక్కువగా తినేస్తుంటారు. అది మరింత బరువును పెంచుతుంది. గ్రీన్ టీ అలవాటు చేసుకోవాలి. ఉప్పు, జంక్ ఫుడ్, సోడా లాంటి పదార్థాలను తగ్గించాలి. బీరు తాగేవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది. ఇతర పదార్థాలతో పోలిస్తే బీరు తాగేవారిలో వచ్చే పొట్ట అంత తేలికగా తగ్గదు. దీని వల్ల గుండె, జీర్ణ సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.

Related News