logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆఫీసులో నిద్ర పోతున్నారా?.. పగటి నిద్రకు చెక్ పెట్టె చిట్కాలు

మధ్యాహ్నం కడుపునిండా భోజనం చేసిన తర్వాత చాలా మందికి ఓ కునుకు తీయడం అలవాటు. ఈ అలవాటు ఇంట్లో ఉండే వారికి నష్టం చేయకపోయినా ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారికి చాలా ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. కొంతమందికి ఆఫీసులకు వెళ్ళగానే నిద్ర మత్తు ఆవహిస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆవలింతలు వస్తుంటాయి. చుట్టూ ఎంత మంది ఉన్నా, చేయాల్సిన పని ఎంత ముఖ్యమైనదైనా దానిపై ధ్యాస ఉంచలేము. శరీరమంతా నిద్ర ఆవహిస్తుంది. ముఖ్యమైన సమయాల్లో పగటి నిద్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మరి ఇలా పగటి వేళల్లో నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పగటిపూట నిద్ర రాకుండా చాలామంది కాఫీ లేదా టీ తాగుతుంటారు. దీని వలన నిద్రకు సులభంగా చెక్ పెట్టవచ్చు. కేంద్ర నాడీ వ్యవస్థలో నిద్ర రావడానికి కారణమయ్యే వాటిపై కాఫీలో ఉండే కెఫీన్ ప్రభావవంతంగా పని చేస్తుంది. అందుకే కప్పు కాఫీ తాగితే నిద్ర రాకుండా చేస్తుంది.

నిద్ర ఎక్కువగా వస్తుంటే మీతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకెళ్లండి. కొద్దీ కొద్దిగా వీటిని తినడం వల్ల నిద్ర రాదు. అయితే ఎక్కువగా తినడం వల్ల త్వరగా జీర్ణం కాక ఇతర సమస్యలు వస్తాయి. రోజులో వీలైనంత ఎక్కువ నీరు తాగడం వల్ల కూడా యాక్టీవ్ గా ఉంటారు. చర్మం మెరుస్తుంది. నిద్ర మత్తు వదిలిపోతుంది.

ఉదయం టిఫిన్ లో గాని, లంచ్ లో గాని మనం తీసుకునే ఆహరం వల్ల కూడా పగటి పూట నిద్ర ముంచుకొస్తుంది. అందుకే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం ఎంచుకోవాలి. అన్నం ఎక్కువగా తీసుకుంటే కూడా నిద్ర వస్తుంది. అందుకే భోజనంలో వీలైనన్ని తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకుంటే నిద్ర మత్తు రాదు. టిఫిన్ బాక్సుల్లో కీరా, క్యారెట్, బీట్ రూట్ లేదా అరటి పండు, ఆపిల్ లాంటివి తీసుకెళ్లండి.

ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా నిద్రలేవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో కాసేపు సూర్యరశ్మిలో గడిపితే మనకు తెలియకుండానే ఆ రోజుకి అవసరమైన శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని పాజిటివ్ గా ఉంచడమే కాకుండా రోజంతా యాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది.

అన్నిటికన్నా ముఖ్యమైనది. వ్యాయామం. ఉదయాన్నే వాకింగ్, కార్డియో లాంటి ఎక్సర్ సైజులు కూడా పగటి నిద్రను దూరం చేస్తాయి. మనం చేసే ఉద్యోగం బోరింగ్ గా ఉంటె కూడా అలసట వల్ల నిద్ర వచ్చేస్తుంది. అలాంటి సమయాల్లో రిఫ్రెష్ కావడానికి కాసేపు పని మధ్యలో విరామం తీసుకోండి. కొలీగ్స్ దగ్గరకు వెళ్లి పలకరించండి. వారితో మాటలు కలపడం వల్ల మనకు తెలియకుండానే నిద్ర మత్తు మటుమాయమవుతుంది. తిరిగి మీ పనిపై దృష్టి పెట్టవచ్చు.

Related News