logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి

గ‌తంలో కంటి స‌మ‌స్యలు ముస‌లి వాళ్ల‌కు వ‌చ్చేవి. వృద్ధాప్యంలోకి వెళుతున్న వారికి క్ర‌మంగా కంటి చూపు మంద‌గించ‌డం జ‌రిగేది. చిన్న వ‌య‌స్సు వారికి ఐ సైట్ అనే స‌మ‌స్య‌నే వినిపించేది కాదు. కొన్నేళ్ల క్రితం నుంచి న‌డి వ‌య‌స్సు వారికి కూడా కంటిచూపు మంద‌గించ‌డం మొద‌లైంది. 35 – 40 ఏళ్ల వారు కూడా కంటి చూపును క్ర‌మంగా కోల్పోవ‌డం, అద్దాలు పెట్టుకోవ‌డం మొద‌లైంది. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది.

ప‌దేళ్ల పిల్ల‌ల‌కు సైతం కంటి చూపు స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. చాలా మంది స్కూలు పిల్ల‌లు కళ్ల అద్దాలు పెట్టుకొని స్కూలుకు వెళుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం. నిజానికి కంటిచూపు మందగించ‌డం అనే స‌మ‌స్యను మ‌నం కొని తెచ్చుకుంటాం. మ‌న అల‌వాట్లు, ఆహార ప‌ద్ధ‌తులే మ‌న‌కు కంటి స‌మ‌స్య‌ల‌ను తెస్తాయి. ఎందుకంటే మ‌న కంటే ఎక్కువ ఏళ్లు జీవించే ఏ జంతువుకూ కంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. కేవ‌లం మ‌నుషుల‌కే చిన్న వ‌య‌స్సు నుంచే కంటి స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి.

మ‌న ఆహార నియ‌మాల్లో, అల‌వాట్ల‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవ‌డం ద్వారా కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు. కంటిచూపును పెంచుకోవ‌డానికి దివ్యౌష‌దం లాంటిది క్యారెట్‌. ప్ర‌తీరోజూ ఉద‌యం క్యారెట్ తిన‌డం లేదా ఇత‌ర ప‌చ్చికూర‌ల‌తో క‌లిపి జ్యూస్ చేసుకొని తాగ‌డం కళ్ల‌కు మంచిది. మ‌నం ఏదైనా తినేట‌ప్పుడు క‌రివేపాకు వ‌స్తే ఏరి ప‌క్క‌న పెడ‌తాం. అదేదో మ‌నం తిన‌కూడ‌నిది అన్న‌ట్లుగా భావిస్తూ ఉంటాం. కానీ, క‌ళ్ల‌కు క‌రివేపాకు చేసినంత మంచి మ‌రేదీ చేయ‌దు.

మున‌గాకు సైతం కంటికి మంచిది. ప‌చ్చికూర‌ల జ్యూస్ తాగేట‌ప్పుడు అందులో మున‌గాకు కూడా వేసుకొని తాగితే మంచిది. లేక‌పోతే వారినికి ఒక‌సారి మున‌గాకు ర‌సం, తేనె, నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగితే కంటిచూపు మెరుగ‌వుతుంది. ఆకు కూర‌లు కళ్ల‌కు మంచివ‌ని మ‌న ఇంట్లో పెద్ద వాళ్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నిజంగానే ఆకు కూర‌లు క‌ళ్ల‌కు చాలా మంచి చేస్తాయి. వారంలో మూడుసార్లైనా ఆకు కూర‌ల‌తో భోజ‌నం చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి.

కొత్తిమీర‌, పూదీన‌తో జ్యూస్ చేసుకొని కొంచెం తుల‌సాకు కూడా వేసుకొని తాగ‌డం కూడా క‌ళ్ల‌కు మంచిది. కంటి చూపుకు ఉప్పు ఎక్కువ‌గా న‌ష్టం చేస్తుంది. కాబ‌ట్టి, ఉప్పును వీలైనంత వ‌ర‌కు త‌గ్గించ‌డం ద్వారా కంటిచూపును మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. ఇక స్మార్ట్‌ఫోన్లు ఎంత త‌క్కువ‌గా వాడితే మ‌న క‌ళ్లు అంత క్షేమంగా ఉంటాయనే విష‌యాన్ని మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో మరిచిపోవ‌ద్దు.

Related News