logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి?

చాలా మంది కాళ్లు, చేతులకు తిమ్మిర్లుపట్టిందని చెపుతుంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిరి రూపంలో సంకేతాలు ఇస్తుంది. ఒక్కోసారి ఆ చోట స్పర్శ కూడా తెలియదు. అయితే తిమ్మిర్లు అన్నీ ఒకే రకానికి చెందినవి కాదు. వీటిలో కూడా తేడాలుంటాయి. కొన్ని పాజిట్ అయితే మరికొన్ని నెగిటివ్ ఉంటాయి. ఒకే చోట ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మంటలు ఏర్పడి, సూదులతో గుచ్చుతునట్టుగా వచ్చే తిమ్మిర్లు పాజిటివ్ అయితే.. దీర్ఘకాలికంగా వచ్చే వాటిని నెగిటివ్ గా పిలుస్తారు. వీటిలో నరాలు ఒత్తిడికి గురై తిమ్మిర్ల వల్ల స్పర్శ కోల్పోతారు. ఇవి నొప్పిని కూడా కలుగజేస్తాయి.

ఈ స్థితిని వైద్య పరిభాషలో పెరిపెరల్ న్యూరోపతి అంటారు. అంటే మెదడుకు, వెన్నుపాముకు దూరంగా ఉండే చేతులు, చేతుల వంటి భాగాల్లో నాడులు దెబ్బతింటాయి. ఇలాంటి సమయాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే నాడులు, రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. అప్పుడు వాటికి రక్తప్రసరణ సక్రమంగా జరగదు. ఫలితంగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు చేరవేస్తాయి. అప్పుడు మెదడు నుంచి వచ్చే సంకేతాలు అస్తవ్యస్తమయ్యి కాళ్ళు, చేతుల్లో ఉండి కండరాల కదలికలు, స్పర్శ దెబ్బతింటాయి. ఇలాంటి సమస్య ఉన్నవారిలో కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు రావడం మొద్దుబారడం, చురుక్కున పొడుస్తున్నట్టుగా అనిపించడం జరుగుతాయి. దీంతో కాళ్లు తిమ్మిర్లు పట్టిందనే భావన వస్తుంది.

ఒత్తిడికి లోనవుతున్న కాళ్లను, చేతులను కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్‌ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కొందరిలో ఎలాంటి కారణాలు లేకుండానే ఇలాంటి సమస్య కనిపిస్తుంటుంది. వీటికి మధుమేహం వంటి రకరకాల సమస్యలు కూడా దోహదం చేస్తుంటాయి. మధుమేహం ఒక్కటే కాదు విటమిన్ బీ12 లోపం ఉన్నా , రక్తనాళాల్లో వాపు ఉన్నా కూడా శరీరం ఇవే లక్షణాలను కనబరుస్తుంది. నాడులు దెబ్బతినడం అనేది థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో కూడా జరుగుతుంది. వారిలో కూడా తిమ్మిర్లు కలుగుతాయి.

రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను పరీక్షించుకోవాలి. అవసరమైతే తగిన చికిత్స తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వెంటనే మందులు వాడటం మంచిది. ఒక వేళ ఇవేవీ కారణాలు కాక విటమిన్ బీ 12 లోపం ఉన్నట్లయితే మందులు, ఇంజెక్షన్ల ద్వారా వాటిని నయం చేస్తారు. క్షయ రోగులకు ఇచ్చే మందుల వల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి. మద్యం తాగే అలవాటు ఉన్న వారికి కూడా దీర్ఘకాలంలో ఈ సమస్య ఎదురవుతుంది. కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు ఎక్కువగా ఉంటె అది మెదడుకు సంబందించిన సమస్య కావచ్చు. నోటిలో అల్సర్లు, కీళ్ల నొప్పులు లాంటివి ఉంటె వాటిని ‘కనెక్టివ్ టిష్యు డిజార్డర్’ గా భావిస్తారు.

మనం కదలకుండా ఒకే చోట కూర్చోవడం వలన ఏర్పడే తిమ్మిర్లు సర్వసాధారణం ఇవి ప్రమాదకరం కావు. తిమిన్లను తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా లాంటి ఉపయోగపడతాయి. ఉద్యోగులు ఒకే చోట కూర్చుని పని చేయాల్సి వస్తే 40 నిమిషాలకు ఒకసారి లేచి నడవాలి. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు రెండు గంటలకు ఒకసారైనా విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ బిగుతుగా ఉన్న షూలు, చెప్పులు ధరిస్తే కూడా తిమ్మిర్లు వస్తాయి. దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగుతుంటే మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నరాల వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యి ఆ తర్వాత కోలుకోలేని అనారోగ్య సమస్యల బారిన పడవలసి ఉంటుంది.

Related News