logo

  BREAKING NEWS

మే 15 లోపు వాట్సాప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకుంటే ఏమవుతుంది?  |   జ‌గ‌న్ – ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు 100 % నిజం.. ఇదే సాక్ష్యం  |   శ‌త్రువులు కూడా ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను శ‌భాష్ అంటారు  |   కరోనాను అడ్డుకునే అస్త్రం అదొక్కటే.. శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు  |   శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు  |   కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్ వీరిలోనే ఎక్కువ.. కారణం ఇదే  |   పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |  

బిగ్ బాస్- 5 లో ఎంట్రీ ఇస్తున్న టిక్ టాక్ స్టార్లు వీరే!

బిగ్ బాస్ సీజన్ 5 త్వరలోనే రాబోతుంది. యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంటెస్టెంట్ల లిస్టు నుంచి లీకులు మాత్రం బయటకు వచ్చేస్తున్నాయి. ఈ షోలో 30 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేయగా అందులో మొత్తం 16 మందికి ఫైనల్ చేయనున్నారు. గత సీజన్ లో ఓ వైపు కరోనా, మరోవైపు లాక్ డౌన్ కారణంగా అంతగా గుర్తింపు లేని వారినే కంటెస్టెంట్లుగా తీసుకొచ్చింది యాజమాన్యం. దీనిపై ప్రేక్షకుల నుంచి కూడా కామెంట్లు వినిపించాయి. దీంతో ఈసారి ఆ తప్పు జరగకుండా యాజమాన్యం జాగ్రత్తపడుతున్నట్టుగా తెలుస్తుంది.

అందుకే సీజన్ 5 కోసం బాగా పాపులర్ అయిన వారిని వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటికే యాంకర్ రవి, హైపర్ ఆది షోలో పాల్గొంటున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సీజన్ 5 లో టిక్ టాక్ స్టార్ల హవా మాములుగా ఉండదట. అందులో బయటకు వస్తున్న కొందరి పేర్లను పరిశీలిస్తే.. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా టిక్ టాక్ స్టార్లు ఉండబోతున్నారని తెలుస్తుంది. వారిలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు కాగా, ఇటీవల జస్వంత్ కారు ఆక్సిడెంట్ చేసి వార్తల్లో నిలిచాడు.

జస్వంత్ షోలోకి ఎంట్రీ ఇస్తే షోకి కావలసిన మైలేజి అందుతుందని యాజమాన్యం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక టిక్ టాక్ లో పాపులర్ అయిన వారిలో దుర్గారావు ఒకరు. టాలీవుడ్ పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ దుర్గారావు దంపతులు టిక్ టాక్ లో సంచలనమే సృష్టించారు. దానికి తోడు ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ అనే డాన్స్ షోలో పండు గ్రూప్ దుర్గారావు ను అనుకరిస్తూ నక్కిలిసు గొలుసు అనే పాటకు స్టెప్పులు వేయడంతో దుర్గారావు పాపులారిటీ మరింత పెరిగిపోయింది.

దీంతో వరుస సినిమా అవకాశాలతో ఇప్పుడు బిజీ బిజీగా మారిపోయాడు దుర్గారావు. ఇప్పటికే బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారంతా బయటకు వచ్చిన కంటెస్టెంట్లు సెలబ్రిటీ ఫేమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కెరీర్ పరంగా కూడా మంచి అవకాశాలను అందుకుంటున్నారు. ఏదేమైనా ఈసారి మాత్రం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కు కొదువ లేకుండా చేసేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. ఈ షో జూన్ చివరి వారంలో గాని జూలై మొదటి వారంలో గాని ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

Related News