logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘టిక్‌టాక్’‌ మళ్ళీ వచ్చింది.. డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతులు

సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో భారత్ చైనాకు చెందిన గా 59 యాప్ లపై నిషేధం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భారతీయులు అధికంగా వినియోగించే టిక్ టాక్ యాప్ కూడా ఉంది. దేశ భద్రత, సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ లను నిషేదిస్తున్నట్టుగా కేంద్రం పేర్కొంది. ఈ నిషేధం ద్వారా చైనాకు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. కాగా టిక్ టాక్ యూజర్లకు తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు.

టిక్ టాక్ బ్యాన్ తర్వాత ఈ యాప్ కనుమరుగైంది. కానీ ఇప్పుడు కొత్తగా టిక్ టాక్ ప్రో ను డౌన్ లోడ్ చేసుకోవాలంటూ కొన్ని లింకులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. టిక్ టాక్ యాప్ ను ఇకపై టిక్ టాక్ ప్రో ద్వారా ఉపయోగించుకోవచ్చు అని ఆ మెసేజ్ సారాంశం. ఈ విషయం నమ్మి ఎవరైనా ఆ లింకుల ద్వారా యాప్ డౌన్ లోడ్ చేస్తే మాల్వేర్ మీ ఫోన్ లోకి ఎంటరయ్యి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది. డేటా అంతా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది.

అసలైన టిక్ టాక్ యాప్ 75MB సైజ్ ఉండగా ఇప్పుడు టిక్ టాక్ ప్రో పేరుతో వైరల్ అవుతున్న యాప్ సైజు 90MB అంటే ఇది నకిలీ యాప్ అని గుర్తించాలి. వీటిని డౌన్ లోడ్ చేసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related News